మజ్లీస్‌ పార్టీ అభ్యర్ధుల జాబితా విడుదల

ఈసారి శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కనీసం 25-30 స్థానాలకు పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన మజ్లీస్‌ పార్టీ ఎప్పటిలాగే 9 స్థానాలలో మాత్రమే పోటీ చేయబోతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ శుక్రవారం హైదరాబాద్‌ పాతబస్తీలోని దారుసలం వద్ద పార్టీ కార్యాలయంలో తమ అభ్యర్ధుల జాబితాను మీడియాకు వెల్లడించారు.