శాసనసభ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్స్‌ స్వీకరణ

ఈ నెల 30వ తేదీన జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్స్‌ స్వీకరణ కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటికే బిఆర్ఎస్ 117, బీజేపీ 88, కాంగ్రెస్‌ 100 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాయి. ఈ మూడు పార్టీలు కాక మజ్లీస్, బీఎస్పీ, వామపక్షాలు కూడా బరిలో ఉన్నాయి. కనుక నేటి నుంచి మంచి రోజు చూసుకొని అన్ని పార్టీల అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్స్‌ దాఖలు చేయడం ప్రారంభించనున్నారు. 

ఈసారి గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్న సిఎం కేసీఆర్‌ ఈ నెల 9వ తేదీన నామినేషన్స్‌ వేస్తారు. 

నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్స్‌ వేసేందుకు గడువు ఉంది. నవంబర్‌ 13న నామినేషన్స్‌ పరిశీలన, 15వరకు వాటి ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్‌ 30న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్‌ 3న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడిస్తారు.