
బీజేపీ ఈరోజు మహబూబ్ నగర్ అభ్యర్ధి పేరు ప్రకటించింది. ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసిన్నట్లు బీజేపీ కేంద్ర కార్యాలయం కొద్దిసేపటి క్రితం ట్విట్టర్‌లో తెలియజేసింది. బీజేపీ ఇప్పటికే 52 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించింది. కనుక రెండో జాబితా కోసం అందరూ ఎదురుచూస్తుంటే అనూహ్యంగా మహబూబ్ నగర్ ఒక్క నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడే మిథున్ రెడ్డి.
మహబూబ్ నగర్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేయబోతుండగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా జూపల్లి కృష్ణరావు పోటీ చేసే అవకాశం ఉంది.
నవంబర్ 3 నుంచి 10వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది కనుక ఆలోగా కాంగ్రెస్, బీజేపీ, బీస్పీ తదితర పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించి బీఫారంలు అందజేయవలసి ఉంటుంది.
నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్లు లెక్కించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.