తెలంగాణ శాసనసభ ఎన్నికలకు 55 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు శుక్రవారం రెండో జాబితా విడుదల చేయబోతోంది. ఢిల్లీలో ఈరోజు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమయ్యి రెండో జాబితాపై చర్చించి ఆమోదముద్ర వేయబోతోంది. కనుక మరికొద్ది సేపటిలో కాంగ్రెస్ అభ్యర్ధుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశమైన తర్వాత కొన్ని సీట్లకు అభ్యర్ధులు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఎవరెవరికి ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారంటే...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: మునుగోడు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: పాలేరు (ఇల్లెందు, పినపాక, అశ్వారావు పేటలో ఆయన సూచించిన అభ్యర్ధులకే టికెట్లు)
తుమ్మల నాగేశ్వర రావు: ఖమ్మం
మధు యాష్కీ: ఎల్బీ నగర్
నీలం మధు ముదిరాజ్: పటాన్ చెరు
సంజీవ రెడ్డి: నారాయాణ్ ఖేడ్
మనోహర రెడ్డి: తాండూర్
కెఎల్ఆర్: మహేశ్వరం
మేఘారెడ్డి: వనపర్తి
మదన్ మోహన్ రావు: ఎల్లారెడ్డి
పటేల్ రమేశ్ రెడ్డి: సూర్యాపేట.