పార్టీ మారేందుకు రాజగోపాల్ రెడ్డికి ఎన్ని సాకులో!

కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్ళిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అందుకు ఆయన చెపుతున్న కుంటిసాకులు వింటే నవ్వొస్తుంది. ఆయన ఏమన్నారంటే... 

• కేసీఆర్‌ని గద్దె దించేందుకే నేను బీజేపీలో చేరాను. కానీ అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్‌ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది అందుకే బీజేపీని వీడుతున్నాను.   

• ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. కాంగ్రెస్‌ కావాలని కోరుకొంటున్నారు. కనుక వారి అభీష్టం ప్రకారం నేను నడుచుకోవాలి కనుక బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. 

• కేసీఆర్‌ని గద్దె దించడమే నా ఏకైక లక్ష్యం. ఆయనను గద్దె దించగల శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని నమ్ముతున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను.

నేడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, నేతి విద్యాసాగర్, ఏనుగు రవీందర్ రెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్, ఆకుల లలిత, సంతోష్ కుమార్‌ ఇంకా పలువురు నేతలు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.