కాంగ్రెస్‌లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్

ఖానాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్‌ ఆమెకు టికెట్‌ నిరాకరించడంతో కొన్ని రోజుల క్రితమే ఆమె బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ నిన్న ఆర్మూర్‌లో పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

ఖానాపూర్ నుంచి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనను కాదని మంత్రి కేటీఆర్‌ తన స్నేహితుడుకి టికెట్‌ ఇప్పించుకొన్నారని రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న ఆయన గెలవకుండా అడ్డుకొంటానాని రేఖా నాయక్ శపధం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. కనుక రెండో జాబితాలో రేఖా నాయక్‌ పేరు ఉండే అవకాశం ఉంది.