తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనా రెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమించడం విశేషం. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు వి.రామారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కంబంపాటి హరిబాబు లకు గవర్నర్ పదవులు లభించాయి. ఇప్పుడు ఇంద్రసేనా రెడ్డికి లభించింది.
ఇంద్రసేనా రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏవిదంగా సాగిందంటే, 1983,85,99 ఎన్నికలలో మలక్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ మద్యలో జరిగిన (1989,94) రెండు ఎన్నికలలో ఓడిపోయారు. 1999లో ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2003 నుంచి నాలుగేళ్ళపాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా సేవలందించారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడుగా నియమితులయ్యారు. 2004లో నల్గొండ నుంచి, 2014లో భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ నియమితులయ్యారు.