రాహుల్ బైక్ ర్యాలీలో అపశృతి: కొండా సురేఖకు గాయాలు

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం జయశంకర్ భూపాలపల్లిలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నప్పుడు, ఆయనకు మద్దతుగా కాంగ్రెస్‌ శ్రేణులు 3,000 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. దానిలో మాజీ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. కారులో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీని చూసి చేయి ఊపుతూ పలకరిస్తూ స్కూటీని నడుపుతున్నప్పుడు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె నుదుటి మీద చేతుల మీద స్వల్ప గాయాలయ్యాయి. సమీప ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స తీసుకొని మళ్ళీ ఆమె బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దపల్లి చేరుకొన్న తర్వాత వేదిక వద్ద రాహుల్, ప్రియాంకా గాంధీ ఇద్దరూ ఆమెను పరామర్శించారు.