
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలలో టికెట్లు లభించని నేతలు తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ నేతలు, బిఆర్ఎస్ పార్టీలో, బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
కాంగ్రెస్‌లో రాజీనామాలు: రాగిడి లక్ష్మా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జిట్టా బాలకృష్ణా రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సోమ శిరీష, ఆమె భర్త సోమ శేఖర్ రెడ్డి. వీరందరూ బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. వీరు కాక కొల్లాపూర్ టికెట్ ఆశించి భంగపడిన చింతలపల్లి జగదీశ్వర్ రావు, ఉప్పల్ నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలో హరివర్ధన్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు. టికెట్ లభించని పలువురు నేతల అంచరులు గాంధీ భవన్ వద్ద ధర్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని రేవంత్ రెడ్డి పక్కన పెట్టేసి, ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికి టికెట్స్ అమ్ముకొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
బిఆర్ఎస్‌లో రాజీనామాలు: ఖానాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీలో రాజీనామాలు: బీజేపీ ఇంకా అభ్యర్ధుల జాబితా ప్రకటించలేదు. నేడో రేపో ప్రకటించగానే ఆ పార్టీలో కూడా టికెట్ లభించని నేతల రాజీనామాల పర్వం మొదలవుతుంది. జాబితా ప్రకటించక మునుపే బీజేపీలో సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి రాజీనామా చేసారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.