మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిన్నట్లు వైద్యులు చెప్పారు. 

కుంజా సత్యవతి మొదట సీపీఎం పార్టీలో ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 ఎన్నికలలో భద్రాచలం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కాంగ్రెస్‌ని వీడారు.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న కుంజా సత్యవతికి త్వరలో జరుగబోయే ఎన్నికలలో భద్రాచలం నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఖరారు కావచ్చని అనుకొంటుంటే ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మృతిపట్ల రాష్ట్ర బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.