
సిఎం కేసీఆర్ ఆదివారం హుస్నాబాద్‌లో తొలి ఎన్నికల సభలో మాట్లాడుతూ, కేవలం పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపాము. మ్యానిఫెస్టోలో పెట్టని అనేక సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నాము. ఒకప్పుడు తెలంగాణ ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది?
ఒకప్పటి సంక్షేమ పధకాలు ఏవిదంగా ఉండేవి ఇప్పుడు ఏవిదంగా ఉన్నాయో?బేరీజు వేసుకొని ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీల పాలన ఏవిదంగా ఉందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. వాటి మాయమాటలు, హామీలు నమ్మి మోసపోవద్దని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాజకీయాలను పక్కనపెట్టి చూస్తే, ఈ పదేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి కళ్ళకు కనబడేంతగా చేసి చూపింది. ఒకప్పుడు అభివృద్ధి అంటే ‘హైదరాబాద్ అభివృద్ధి’ అన్నట్లుండేది. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలకు అభివృద్ధి విస్తరించింది.
గత ప్రభుత్వాలు అమలుచేసిన సంక్షేమ పధకాలతో ప్రజల అవసరాలు తీరేవి కావు. కనుక అవన్నీ నిరుపయోగంగా, వాటి కోసం ఖర్చు చేసిన వేలకోట్ల ప్రజాధనం వృధా అవుతుండేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలలో 90 శాతం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
కనుక ఈ అభివృద్ధిని, సంక్షేమ పధకాలను చూసి ఓట్లేయాలని కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కనుక కేసీఆర్ పాలన ఏవిదంగా ఉందో ప్రజలే ఆలోచించుకొని నవంబర్ 30న తీర్పు చెప్పాలి.