కొల్లాపూర్ కాంగ్రెస్‌లో భగభగలు

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన తొలి జాబితాపై అప్పుడే నిరసనలు మొదలయ్యాయి. కొల్లాపూర్ టికెట్‌ని పార్టీలో కొత్తగా చేరిన జూపల్లి కృష్ణరావుకి ఖరారు చేయడంతో, అక్కడి నుంచి పోటీ చేయాలనుకొన్న కాంగ్రెస్‌ నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు, ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొల్లాపూర్‌లోని వారు ఏర్పాటు చేసుకొన్న కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీ జెండాలను, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్‌ రెడ్డితదితరుల ఫ్లెక్సీ బ్యానర్లను, కటవుట్‌ రోడ్డుపై పోసి నిప్పు పెట్టి దహనం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమను కాదని ఇంతకాలం తాము పోరాడుతున్న జూపల్లి కృష్ణారావు వంటి అవినీతిపరుడికి టికెట్‌ ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాకుండా టికెట్లను అమ్ముకొని భారీగా సంపాదించుకొంటున్నారని వారు ఆరోపించారు. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావుని తామే ఒడగొడతామని చింతలపల్లి జగదీశ్వర్ రావు, అనుచరులు శపధం చేశారు.