13.jpg)
ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు సిఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత 119 అభ్యర్ధులకు బీ-ఫారంలు అందజేసి వారికి ఎన్నికలకు ఏవిదంగా సిద్దం అవ్వాలో, ప్రత్యర్ధి పార్టీలను ఏవిదంగా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేస్తారు. ఈ రెండు కార్యక్రమాలు ముగించుకొన్న తర్వాత హెలికాఫ్టర్‌లో సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ వెళ్ళి సాయంత్రం 4 గంటలకు తొలి ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారు.
నేడు విడుదల చేయబోయే బిఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు కొత్తగా అనేక వరాలు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వాటిలో ప్రధానంగా...
• రాష్ట్రంలో నిరుపేద మహిళలకు నెలకు రూ.3,000 పింఛన్. ప్రస్తుతం రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటినవారికి పెన్షన్ ఇస్తోంది. అవి కాకుండా ఇది కొత్తగా ప్రవేశపెట్టబోతోంది. ఉచిత బస్సు ప్రయాణం.
• ఆసరా పింఛన్ రూ.2,016 నుంచి రూ.3,016కి పెంపు.
• 57 సంవత్సరాలు దాటిన రైతులకు, జర్నలిస్టులకు పెన్షన్ నెలకు రూ.2,000 పెన్షన్
• సీనియర్ సిటిజన్స్ కు కొత్తగా భరోసా పధకం కింద పోష్టికాహారం
• ఆరోగ్యశ్రీ పధకం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
• రైతుభీమా పధకం 90 లక్షల కుటుంబాలకు వర్తింపు
• రైతుబంధు ఏడాదికి ఎకరానికి రూ.10,000 నుంచి రూ.16,000కి పెంపు
• రైతుబంధుతో పాటు ఉచితంగా రెండు బస్తాల యూరియా సరఫరా
• కేసీఆర్ కిట్ రూ.12,000 నుంచి రూ.15,000కి పెంపు
• వంట గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.400 సబ్సీడీ
• పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యాట్ పన్ను తగ్గింపు
• కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పధకాలలో ఆర్ధిక సాయం రూ.1,00,116 నుంచి రూ.1,25,000కు పెంపు
• మహిళలు, యువతకు రూ.2 లక్షలు వడ్డీ లేని రుణాలు
• బీసీ విధ్యార్ధులకు 100 శాతం కోచింగ్ ఫీజ్ చెల్లింపు
• నిరుద్యోగభృతి.