తెలంగాణకు ఈసీ ఆమోదించిన అధికారులు వీరే

ఇటీవల కేంద్ర ఎన్నికల కమీషన్ తెలంగాణలో 20 మంది ఉన్నతాధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించి, ఎన్నికలు పూర్తయ్యేవరకు వారికి ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి పంపిన 60 మంది అధికారులలో 20 మందిని కేంద్ర ఎన్నికల కమీషన్ ఎంపిక చేసి ఆ జాబితాను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆ జాబితాను మీడియాకు విడుదల చేశారు.