సంబంధిత వార్తలు
6.jpg)
నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరుగబోతున్నందున, సిఎం కేసీఆర్ 54 నియోజకవర్గాలకు బిఆర్ఎస్ ఇన్‌చార్జిలను నియమించారు. గత తొమ్మిదిన్నరేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశాము. అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నాము. కనుక ఈసారి కూడా బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని, అయితే కాంగ్రెస్, బీజేపీల మాయమాటలు చెప్పి ప్రజలను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కనుక కొత్తగా నియమితులైన ఇన్‌చార్జిలందరూ తమతమ నియోజకవర్గాలలో ప్రజలను చైతన్య పరిచి బిఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకొనేందుకు గట్టిగా కృషి చేయాలని సిఎం కేసీఆర్ సూచించారు.