ఆదివారం కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల?

తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్ధుల తొలి జాబితా ఈ నెల 15వ తేదీన వెలువడనుంది. దీని కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ పోటీ తక్కువగా ఉన్న మరియు సీనియర్ నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసి ఆమోదం కొరకు కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపించింది. కేంద్ర స్క్రీనింగ్ కమిటీ దానిని పరిశీలించి ఆమోదముద్ర వేయగానే తెలంగాణ కాంగ్రెస్‌ అధికారికంగా అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తుంది. తొలిజాబితాలో సుమారు 70-80 మంది అభ్యర్ధుల పేర్లు ఉండవచ్చని తెలుస్తోంది.   

బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మొత్తం 119 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించేసి ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేసింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం ఇంతవరకు అభ్యర్ధుల జాబితాలను ప్రకటించలేకపోయాయి. నవంబర్‌ 3 నుంచి 10వ తేదీలోగా నామినేషన్స్‌ దాఖలు చేయవలసి ఉంటుంది. కనుక వీలనంత త్వరగా అభ్యర్ధులను ఖరారు చేయవలసి ఉంటుంది.