రాజస్థాన్ పోలింగ్ తేదీ మారింది ఎందుకంటే....

రాజస్థాన్ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీని మారింది. ఇటీవల ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్‌ 23న రాష్ట్రంలో పోలింగ్ జరుగవలసి ఉంది. కానీ అదే రోజున దేవ్ ఉధాని ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేలకు పైగా వివాహాలు జరుగనున్నాయి. వాటి వలన సుమారు 200 నియోజకవర్గాలలో పోలింగులో పాల్గొనే వారి సంఖ్య తగ్గిపోతుంది. కనుక పోలింగ్ తేదీని మార్చలంటూ వివిద పార్టీల నుంచి అభ్యర్ధన మేరకు నవంబర్‌ 25వ తేదీన పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది.   

సవరించిన తాజా షెడ్యూల్ ఈవిదంగా ఉంది: 

ఎన్నికల నోటిఫికేషన్‌: అక్టోబర్‌ 30

నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ: నవంబర్‌ 6

నామినేషన్ల పరిశీలన: నవంబర్‌ 7

నామినేషన్ల ఉపసంహరణకు గడువు: నవంబర్‌ 9

పోలింగ్: నవంబర్‌ 25

ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: డిసెంబర్‌ 3

ఎన్నికల ప్రక్రియ ముగింపు: డిసెంబర్‌ 5.