12.jpg)
హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో మెట్రో అధీనంలో ఉన్న భారీ హోర్దింగ్స్ అన్నీ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకే కేటాయిస్తున్నారని, ఇది సరికాదని హితవు పలికారు.
కనుక కాంగ్రెస్ పార్టీకి కూడా తమ ఎన్నికల ప్రచారానికి సంబందించి బ్యానర్లు పెట్టుకోవడానికి హైదరాబాద్ మెట్రో అధికారులు తప్పనిసరిగా కొన్ని హోర్దింగ్స్ కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరారు.
తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకే కేటాయిస్తున్నట్లయితే డిసెంబర్ 9వ తేదీనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పట్ల వివక్ష చూపుతున్న హైదరాబాద్ మెట్రోఅధికారులందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మెట్రో అధికారులు నియమ నిబందనలకు లోబడి అన్ని పార్టీలకు సమానంగా హోర్దింగ్స్ కేటాయించాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా తమ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులకు ఇదేవిదంగా హెచ్చరిస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాలలో అధికార పార్టీ నేతల నుంచి అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మరీ ఎక్కువగా ఉంటుంది. కనుక వారు నిసహాయులే.