
కేంద్ర ఎన్నికల కమీషన్ నేడు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కనుక నేటి నుంచే 5 రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన్నట్లు ఈసీ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 1,58,71,493 కాగా, స్త్రీలు 1,58,43,339 మంది ఓటర్లున్నారు. రాష్ట్రంలో 2,557 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లున్నారు. 18-19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 8,11,640 మంది ఉన్నారు. దివ్యాంగులు 5.06 లక్షల మంది, 80 ఏళ్ళు పైబడిన వారు 4.4 లక్షల మంది, వందేళ్ళు పైబడిన ఓటర్లు 7005 మంది ఉన్నారు.
వీరుకాక ఆర్మీ, నేవీ వంటి సర్వీసులలో ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు 15,338 మంది, విదేశాలలో మరో 2,2780 మంది ఓటర్లున్నారు. అందరూ కలిపి మూడు కోట్ల 17 లక్షల మందికి పైగా ఓటర్లున్నారని ఈసీ తెలిపింది.
శాసనసభ ఎన్నికల కోసం రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 78 శాతం పోలింగ్ కేంద్రాలకు వెబ్ క్యాస్టింగ్ ఉంటుంది. కేవలం మహిళల కోసమే 597 కేంద్రాలు, దివ్యాంగుల కోసమే ప్రత్యేకంగా 120, మోడల్ పోలింగ్ కేంద్రాలు: 644 ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.