టిఎస్ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్ కృషి వలన ఇప్పుడిప్పుడే ఆ సంస్థ గాడినపడుతోంది. లాభాల బాట పడుతోంది. ఇటువంటి సమయంలో ‘నా తండ్రి అవినీతిపరుడని’ సొంత కూతురే ముద్ర వేసిన జనగామ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని టిఎస్ఆర్టీసీ ఛైర్మన్గా నియమించడం ఆ సంస్థలో అందరికీ చాలా ఆందోళన కలిగిస్తుంది.
అవినీతి ఆరోపణల కారణంగానే సిఎం కేసీఆర్ ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించారు. కానీ ఆయనకు ఏదో ఓ పదవి కట్టబెట్టి బుజ్జగించకపోతే జనగామలో బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఓడించేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. కనుక ఈ పదవి కట్టబెట్టిన్నట్లు అర్దమవుతోంది. కానీ టికెట్ నిరాకరించిన అటువంటి వ్యక్తికి టిఎస్ఆర్టీసీకి ఛైర్మన్గా నియమించడం సరైన నిర్ణయం కాదనే చెప్పక తప్పదు.