
క్యాసినో కింగ్, మనీ లాండరింగ్ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్కు చెందిన చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరాలనే తన పంతం నెరవేర్చుకొన్నారు. శనివారం మధ్యాహ్నం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి మళ్ళీ మొహం చాటేశారు.
కొన్ని రోజుల క్రితమే చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు భారీ ఊరేగింపుగా పార్టీ కార్యాలయానికి తరలిరాగా, కిషన్ రెడ్డితో సహా ముఖ్యనేతలందరూ మొహం చాటేశారు. దానిని తీవ్ర అవమానంగా భావించిన చికోటి ప్రవీణ్ తాను బీజేపీలో చేరకుండా ఎవరూ అడ్డుకోలేరని, బీజేపీలో చేరిన తర్వాత తనకు అవరోధాలు సృష్టించిన వారందరి భరతం పడతానని అన్నారు.
కనుక చికోటి రాకతో ఇకపై తెలంగాణ బీజేపీలో మరో కొత్త అంతర్గత యుద్ధం ప్రారంభం అవుతుందనుకోవచ్చు. కనుక పార్టీ సీనియర్ నేతలు చికోటితో కలిసి పనిచేస్తారో?ఎన్నికలలో బీజేపీని ఎలా గెలిపించుకొంటారో?