మంగళవారంలోగా తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్

తెలంగాణతో సహా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ రేపటి నుంచి మంగళవారంలోగా ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషన్ అధికారులు హైదరాబాద్‌లో చివరి పర్యటన ముగించుకొని ఢిల్లీ తిరిగి చేరుకొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికల కమీషన్ పర్యటించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్ధారించుకొంది. కనుక రేపటి నుంచి ఏక్షణంలోనైనా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్‌ నెలాఖరు నుంచి డిసెంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్‌ 2వ వారంలో ఓట్లు లెక్కించి వెంటవెంటనే ఫలితాలు ప్రకటించవచ్చు. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రంలో రెండు దశలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రాలలో ఒకేసారి ఒకే రోజున ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.