
త్వరలో జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం ఏకంగా 14 కమిటీలను ఏర్పాటు చేసింది. వాటిలో కొన్నిటిని చూస్తే అవి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కమిటీలా లేక పార్టీలో అసంతృప్తి నేతలందరికీ ఏదో పదవి కట్టబెట్టి సంతృప్తి పరచడానికి ఏర్పాటు చేసిందా?అని అనిపించక మానదు.
• స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
• మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్: వివేక్ వెంకటస్వామి
• ఆందోళనల కమిటీ చైర్ పర్సన్: విజయశాంతి
• చార్జ్ షీట్స్ కమిటీ ఛైర్మన్: మురళీధర్ రావు
• బహిరంగసభల కమిటీ ఇన్చార్జి: బండి సంజయ్
• ఎన్నికల కమిటీ ఛైర్మన్: మర్రి శశిధర్ రెడ్డి
• సోషల్ మీడియా మీడియా కమిటీ ఛైర్మన్: ధర్మపురి అర్వింద్
• ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్ పర్సన్: డికె అరుణ.