
ఇటీవల ఖమ్మం లకారం టాంక్ బండ్ పార్కు వద్ద శ్రీకృష్ణుడు అవతారంలో ఉన్న ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎన్టీఆర్ మహనీయుడు చరిత్రలో శాస్వితంగా నిలిచిపోతారంటూ పొగిడారు.
దీనిపై ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, “బిఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ భజన ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసు. త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో స్థిరపడ్డ ఆంద్రా ఓటర్లను ఆకట్టుకోవడానికే. ఇంతకాలం చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించని బిఆర్ఎస్ నేతలు, ఈ మూడు రోజులుగా ఖండించడం ప్రారంభించారు. ఇది కూడా ఆంద్రా ఓట్ల కోసమే తప్ప ఎవరికీ మనసులో చంద్రబాబు నాయుడు గురించి బాధ లేదు. అయితే ఎన్టీఆర్ భజన చేస్తేనో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టుపై మొసలి కన్నీళ్ళు కార్చితేనో ఆంద్రా ఓటర్లు ఆమాత్రం గ్రహించలేరనుకోవడం అవివేకం,” అని బాలకృష్ణ అన్నారు.
కొన్ని రోజుల క్రితం హైటెక్ సిటీలో ఐటి ఉద్యోగులు చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తూ ధర్నాలు చేస్తే మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రెండు పార్టీల రాజకీయ పంచాయతీ ఉంటే అక్కడకు వెళ్ళి తేల్చుకోవాలి కానీ ఇక్కడ చేస్తే కుదరదని నిష్కర్షగా చెప్పేశారు. కానీ ఇప్పుడు మంత్రులు ఒకరొకరుగా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తున్నారు. అందుకే బాలకృష్ణ ఈవిదంగా స్పందించారని భావించవచ్చు.
ఎన్నికలు వస్తున్నాయ్.. TRS నాయకులు జపం మొదలుపెట్టారు. #ChandrababuArrest pic.twitter.com/tjqVqoGIe6