
త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లున్నారు.
వారిలో పురుషులు 1,58,71,493 కాగా, స్త్రీలు 1,58,43,339 మంది ఓటర్లున్నారు. రాష్ట్రంలో 2,557 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లున్నారు.
వీరుకాక ఆర్మీ, నేవీ వంటి సర్వీసులలో ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు 15,338 మంది, విదేశాలలో మరో 2,2780 మంది ఓటర్లున్నారు. అందరూ కలిపి మూడు కోట్ల 17 లక్షల మందికి పైగా ఓటర్లున్నారని ఈసీ తెలిపింది.
రాష్ట్రంలో 18-19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 8,11,640 మంది ఉన్నారు. మరణించినవారి ఓట్లు, బోగస్ ఓట్లు కలిపి మొత్తం 6,10,694 ఓట్లు తొలగించామని ఈసీ పేర్కొంది.
సెప్టెంబర్ 19నాటికి సవరించిన తుది జాబితా ప్రకారం ఇది ఓటర్ల తుది జాబితా అని ఈసీ తెలిపింది. అయితే 2023, అక్టోబర్ 1నాటికి 18 ఏళ్ళు నిండిన యువతీయువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని తెలియజేసింది.