తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపురూప ఘటన నేడు జరుగబోతోంది. సిఎం కేసీఆర్ నేడు రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది వైద్య కళాశాలలను వర్చువల్‌గా సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపలపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వీటిని నిర్మించింది.
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రం కేవలం 5 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. వాటి ద్వారా ఏడాదికి 2,850 మంది వైద్యులు మాత్రమే బయటకు వచ్చేవారు. కానీ ఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 21 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా ఇప్పుడు ఏడాదికి 8,515 మంది వైద్యులు బయటకు వస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక మెడికల్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. అలాగే ప్రతీ లక్షమంది ప్రజలకు 22 మంది వైద్యులున్న రాష్ట్రంగా నిలుస్తోంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ఈ వైద్య కళాశాలలన్నిటిలో 85 శాతం సీట్లు స్థానికులకే కేటాయించడం వలన తెలంగాణలో వైద్యవిద్యను అభ్యసించాలనుకొనేవారికి అవకాశాలు మెరుగయ్యాయి కూడా