అలనాటి ప్రముఖ నటి జయసుధ ఈసారి శాసనసభ ఎన్నికలలో బీజేపీ తరపున సికింద్రాబాద్ లేదా సనత్ నగర్ నియోజకవర్గాలలో ఏదో ఓ చోట నుంచి పోటీ చేయాలనుకొంటున్నారు. ఇందుకోసం ఆమె దరఖాస్తు చేసుకొన్నారు కూడా.
ఇదివరకు ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు కనుక మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు. అయితే సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలలో బీజేపీలో పోటీ చేసేందుకు చాలామందే పోటీపడుతున్నారు.
కనుక బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తుందా లేదా అనేది ఇంకా తెలియవలసి ఉంది. ఆమె తెలంగాణ ప్రజలందరికీ చిరపరిచుతురాలు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలలో బీజేపీకి బలమైన అభ్యర్ధులు లేరు కనుక ఆమెను వేరే చోటి నుంచి పోటీ చేయమని కోరవచ్చు. అందుకు ఆమె సిద్దపడితే మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.