తెలంగాణ శాసనసభ ఎన్నికలు వాయిదా?

ఈ ఏడాది డిసెంబర్‌తో తెలంగాణ శాసనసభ గడువు ముగుస్తుంది కనుక మూడు నెలలు ముందుగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టవలసి ఉంటుంది. ఈ లెక్కన అక్టోబర్‌ 10లోగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయవలసి ఉంటుందని, ఒకవేళ ఆలోగా జారీ చేయకపోతే శాసనసభ ఎన్నికలు వాయిదా వేసిననట్లే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముందుగా జరిగి వాటిలో బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం వెంటనే జరిగే లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని మోడీ, అమిత్ షాలు భయపడుతున్నట్లున్నారని అన్నారు. అందుకే జమిలి ఎన్నికలంటున్నారని, వాటిపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీ కూడా వేశారని కేటీఆర్‌ అన్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో శాసనసభ ఎన్నికలపై స్పష్టత రావచ్చని మంత్రి కేటీఆర్‌ అన్నారు.