ఈ నెల 17న కాంగ్రెస్, బిజెపిలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగసభ నిర్వహించేందుకు పోటీ పడినప్పటికీ, చివరికి కాంగ్రెస్ వెనక్కు తగ్గి నగర శివారులోని తుక్కుగూడ వద్ద ఆదేరోజున బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది.
ఆ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ముగ్గురూ పాల్గొబోతున్నారు. ముందుగా ఈ నెల 16,17 తేదీలలో హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించనుండి. ఈ కమిటీ కాంగ్రెస్ పార్టీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత స్థాయి కమిటీ. పార్టీ బిజెపి జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే ఈ రెండు రోజుల కమిటీ సమావేశాలకు , సోనియా గాంధీతో సహా వర్కింగ్ కమిటీ సభ్యులు అందరూ హాజరవుతారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈసారి హైదరాబాద్‌లో వర్కింగ్ కమిటీ సమావేశాలు, అనంతరం భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. తెలంగాణతో సహా జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్ బలపదిందని, ఇక్కడ తెలంగాణలో, ఇండియా కూటమితో కలిసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని దేశ ప్రజలకు తెలియజేసేవిదంగా ఈ సభలు, సమావేశాలు అట్టహాసంగా నిర్వహించేందుకు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కమిటీలు వేసుకొని విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు ఈసారి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని 17వ తేదీన నిర్వహించబోయే బహిరంగసభలో తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వనున్నారు. అందుకే ఈ సభకు సోనియా గాంధీని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మరి తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలలో దేనివైపు మొగ్గుచూపుతారో?