చెన్నమనేనిని కేసీఆర్‌ అలా చల్లబరిచారు

వేములవాడ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వ వివాదంలో చిక్కుకొని న్యాయపోరాటం చేస్తుండటంతో, సిఎం కేసీఆర్‌ ఈసారి ఆయనను పక్కనపెట్టి చల్మెడ లక్ష్మీనర్సింహారావుకి టికెట్‌ కేటాయించారు. దీంతో చెన్నమనేని భగ్గుమన్నారు. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. 

వేములవాడ ప్రజలలో చెన్నమనేని కుటుంబానికి మంచి పేరుంది. కనుక నియోజకవర్గంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. కనుక ఆయన వ్యతిరేకిస్తే చల్మెడ లక్ష్మీనర్సింహారావు గెలుపు చాలా కష్టం అవుతుంది. 

కనుక వృత్తిరీత్యా వ్యవసాయ శాస్త్రవేత్త కూడా అయిన చెన్నమనేని రమేష్ బాబుని వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమిస్తున్నట్లు  కేసీఆర్‌ ప్రకటించారు. క్యాబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో 5 ఏళ్ళు ఆయన ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తారు. ఈ మేరకు సిఎస్ శాంతికుమారు నేడు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. 

దీంతో చెన్నమనేని రమేష్ బాబు, అనుచరులు చల్లబడ్డారు. కనుక వేములవాడలో బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న చల్మెడ లక్ష్మీనర్సింహారావుకి లైన్ క్లియర్ అయినట్లే.