సూర్యపేటలో అభివృద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాలను ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి చేస్తుండటంతో వాటి రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ఒకప్పుడు సరైన రోడ్లు, లైట్లు కూడా లేని సూర్యాపేటలో ఇప్పుడు సువిశాలమైన రోడ్లు, ధగధగ వెలిగే లైట్లు, పార్కులు, మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ, సమీకృత కలెక్టర్ కార్యాలయం, సమీకృత మార్కెట్‌, ఎక్కడ చూసినా పచ్చదనం... ఒకటేమిటి ఎటు చూసినా అభివృద్ధి కళ్ళకు కట్టిన్నట్లు కనిపిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి చొరవ తీసుకొని, పట్టుబట్టి నిధులు సాధించుకొని పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపించారు. తాను చేసిన ఈ అభివృద్ధిపనుల గురించి వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో ఫోటోలతో సహా పెట్టారు. 

వాటిలో రూ.156 కోట్లు వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల, రూ.30.17 కోట్లు వ్యయంతో సమీకృత శాఖాహార, మాంసాహార  మార్కెట్‌ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వాటిని, వాటి పక్క నుంచి పట్టణంలో ఈ కోసం నుంచి ఆ కొస వరకు సాగుతున్న విశాలమైన రోడ్డుని, పట్టణం అంతా పరుచుకొన్న పచ్చదనం చూస్తే ఎవరికైనా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రజలు కోరుకొనే అభివృద్ధి ఇదే కదా?