టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ సందేహాలు ఏమిటంటే...

టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మద్య మళ్ళీ కొత్త యుద్ధం ప్రారంభమైంది. ఈసారి ఈ యుద్ధంలో కి రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రవేశించారు. తక్షణం ఈ బిల్లును ఆమోదించాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ బిల్లుని ఆమోదించడానికి తనకేమీ అభ్యంతరం లేదని అయితే 6 అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రభుత్వానికి శనివారం ఉదయం ఓ లేఖ వ్రాశారు. ఇంతకీ ఆమె ఏమి సందేహాలు వ్యక్తం చేశారంటే.... 

1. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత వారికి కార్మిక చట్టాలు వర్తింపజేస్తుందా లేదా? లేకుంటే వారి ప్రయోజనాలను ఏవిదంగా కాపాడుతుంది? 

2. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత దానిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం పెన్షన్ చెల్లిస్తుందా లేదా?

3. వారి ఉద్యోగాలకు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందా లేదా?

4. ప్రభుత్వోద్యోగులలో డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కానీ కండెక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు కనుక వారిని ఏ క్యాడర్‌లో తీసుకోబోతోంది?వారికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర ప్రయోజనాలు అన్నీ అందజేస్తుందా లేదా?      

5. ఆర్టీసీకి 1958 నుంచి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గ్రాంట్స్, రుణాలు, ఇతర సహాయాల గురించి బిల్లులో ఎందుకు పేర్కొనలేదు?

6. రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 9 ప్రకారం టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుత మార్చడం గురించి వివరాలు బిల్లులో ఎందుకు పేర్కొలేదు?

వీటిపై సంతృప్తికర వివరణ ఇచ్చిన్నట్లయితే తక్షణమే బిల్లుని ఆమోదించి పంపిస్తానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశారు.