హైదరాబాద్ నగరంలో హబ్సీగూడలో బుదవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ ఉన్న భవనంలో కిందన రెండు అంతస్తులలో బట్టల దుకాణాలు ఉన్నాయి. వాటిలో అన్‌లిమిటెడ్ అనే బట్టల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగి పైకి వ్యాపించిన్నట్లు తెలుస్తోంది. శ్రావణం మాసం కొరకు బట్టల దుకాణాలలో భారీగా స్టాక్స్ తెప్పించి పెట్టగా అవన్నీ అగ్నికి ఆహుతి అయిన్నట్లు తెలుస్తోంది.
ఈ సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది బట్టల దుకాణాలలో, రెస్టారెంట్‌లో చిక్కుకొన్న వినియోగదారులను, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనానికి సమీపంలోనే ఓ పెట్రోల్ బంకు కూడా ఉండటంతో మంటలు అటువైపు వ్యాపించకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకొంటున్నారు.