కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరు రాజకీయాలలోకి

కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరు రాజకీయాలలోకి ప్రవేశించారు. సిఎం కేసీఆర్‌ తన అన్న కల్వకుంట్ల రంగారావు కుమారుడు కల్వకుంట్ల వంశీధర్ రావును మహారాష్ట్ర బిఆర్ఎస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు వంశీధర్ రావు ఆ పార్టీలో చురుకుగా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యంతో పాటు ఆయాన కూడా రాజకీయాలకు దూరం అయ్యారు. గత కొంతకాలంగా కేసీఆర్‌కు సన్నిహితంగా మెలుగుతుండటంతో ఆయనకు మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. 

కేసీఆర్‌ అన్న రంగారావు కుమార్తె రేగులపాటి రమ్యారావు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు రితీష్ రావు ఎన్‌ఎస్‌యు విద్యార్ధి సంఘంలో చుకురుకుగా పనిచేస్తున్నారు. అతనుఎన్‌ఎస్‌యు విద్యార్ధి సంఘంతో కలిసి అసెంబ్లీ ఎదుట ధర్నా చేయగా పోలీసులు అతనిని అరెస్ట్‌ చేశారు. అప్పుడు అతని తల్లి రమ్యారావు కూడా డిజిపి అంజని కుమార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తూ ధర్నా చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నందునే కేసీఆర్‌ తమను పోలీసులతో ఈవిదంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

ఆగస్ట్ 1వ తేదీన సిఎం కేసీఆర్‌ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని వటేగావ్‌లో పర్యటించనున్నారు. ప్రముఖ సామాజికవేత్త అన్నాభావ్ సాథే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్‌ మహారాష్ట్రకు వెళ్ళబోతున్నారు. అనంతరం కొల్లాపూర్‌లోని అంబాబాయి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేస్తారు.