
కేరళ మాజీ ముఖ్యమంత్రి చాందీ ఊమెన్ (79) మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిన నేతలలో ఊమెన్ చాందీ ఒకరు. ఆయన రెండుసార్లు కేరళ ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన 27 ఏళ్ళ వయసులో తొలిసారిగా 1970లో తిరువనంతపురం జిల్లాలోని పూటుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గం నుంచి వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటే ఆయనకు ఎంత ప్రజాధారణ ఉందో అర్దం చేసుకోవచ్చు. ఆయన నాలుగుసార్లు కేరళ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, వర్కింగ్ కమిటీ సభ్యుడుగా పనిచేశారు. కొంతకాలం ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.