తెలంగాణలో నిరుపేద ముస్లిం, క్రీస్టియన్ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘కేసీఆర్ కానుక’ పేరుతో మొత్తం 20 వేల కుట్టు మిషన్లు పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఎండీ కాంతివెస్లీ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. వీటిలో ముస్లిం మహిళలకు 18 వేల మిషన్లు, క్రీస్టియన్ మహిళలకు 2,000 మెషిన్లు కేటాయించబడతాయి. వీటితో పాటు లబ్ధిదారులకు ఉచితంగా కుట్టుశిక్షణ కూడా ఇప్పిస్తామని తెలిపారు.
తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ముస్లిం, క్రీస్టియన్స్ మహిళలు మాత్రమే ఈ పధకానికి అర్హులు. వయో పరిమితి 21 నుంచి 55 ఏళ్ళ లోపు. ఒంటరి మహిళలు, వితంతువులకు, నిరుపేద మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. పట్టణ ప్రాంతాలలో ఉన్న మహిళలకైతే వార్షికాదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు రూ.1.50 లక్షల వార్షికాదాయం మించకూడదు.
కులం, మతం, ఆదాయం, విద్యార్హతలు తదితర ధృవీకరణ పత్రాలు, ఫోటోతో కలిపి దరఖాస్తులను జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయాలలో సమర్పించవలసిందిగా కాంతివెస్లీ కోరారు.