హైదరాబాద్‌కు కొత్త కలెక్టర్... 31 ఐఏఎస్‌లు బదిలీ

శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ఎన్నికల కమీషన్‌ సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్‌కు అనుదీప్ దురిశెట్టిని కలెక్టర్‌గా నియమించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రియాంకా ఆల, ములుగు జిల్లాకు తిరుపతి ఇల, పెద్దపల్లి జిల్లాకు ముజమ్మిల్ ఖాన్ కలెక్టర్లుగా నియమితులయ్యారు. వీరుకాక రాష్ట్రంలో 31 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఏ.శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.          

అలాగే వెంకటేశ్ ధోత్రే (మహబూబ్‌నగర్‌), అభిలాష్ అభినవ్ (ఖమ్మం), ఎం.మను చౌదరి (కామారెడ్డి), దివాకర టిఎస్ (జగిత్యాల్), కుమార్‌ దీపక్ (నాగర్‌కర్నూలు), చెక్క ప్రియాంకా (పెద్దపల్లి), జల్దా అరుణశ్రీ (కరీంనగర్‌), చంద్రశేఖర్ బడుగు (సంగారెడ్డి), ప్రతిమా సింగ్‌ (రంగారెడ్డి), గరిమ అగర్వాల్ (సిద్ధిపేట)కు అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)గా నియమితులయ్యారు.