
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తాను కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి శాసనసభకు పోటీ చేయబోతున్నట్లు శనివారం ప్రకటించారు. ఇక్కడ బీఎస్పీ తరపున కొనప్పను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన, అనుచరులు అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
శనివారం బీఎస్పీ అధ్వర్యంలో కాగజ్‌నగర్‌లో భారే ర్యాలీ నిర్వహించాగా దానిలో పాల్గొన్న ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే కొనప్పపై, కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులు పేపర్ మిల్లును తమ గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆందవేల్లీ వంతెన నిర్మాణం పూర్తికాకముందే కూలిపోయిందని, కోనప్ప కమీషన్లకు కక్కుర్తి పడటం వలననే ఈవిదంగా జరిగిందన్నారు.నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపించినా ఎమ్మెల్యే కోనప్ప, అనుచరులు కబ్జా చేసేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ చెప్పుకొంటున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు హైదరాబాద్, కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమవుతోందని, ఆసిఫాబాద్ జిల్లాలోని అనేక గ్రామాలు నేటికీ అభివృద్ధికి నోచుకోలేదని ఇక్కడి గిరిజనులకు ఎటువంటి సంక్షేమ పధకాలు అందడం లేదని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కనుక కోనప్ప అవినీతిని అంతం చేసి ఆసిఫాబాద్ జిల్లాలో అభివృద్ధి సాధించాలంటే ఈసారి తనకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రవీణ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.