ప్రధాని నరేంద్రమోడీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్

ప్రధాని నరేంద్రమోడీ శనివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన షెడ్యూల్ ఈవిదంగా ఉంటుంది. ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రత్యేక విమానంలో వారణాశి నుంచి బయలుదేరి ఉదయం 9.45 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు.

అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.15 గంటలకు వరంగల్‌ చేరుకొంటారు. జిల్లాలో మామునూరు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.45 గంటలకు వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొంటారు. అక్కడి నుంచి 11.00 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సభావేదిక వద్దకు చేరుకొంటారు.

సభవేదిక నుంచే వర్చువల్ పద్దతిలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 11.45 నుంచి 12.20 గంటల వరకు బిజెపి అధ్వర్యంలో జరుగబోయే విజయ సంకల్పసభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తారు.

సభ ముగిసిన తర్వాత మామునూరు చేరుకొని హెలికాఫ్టర్‌లో హకీంపేటకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హకీంపేట నుంచి రాజస్థాన్‌కు బయలుదేరి వెళతారు.       

రేపు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించబోయే అభివృద్ధి పనుల వివరాలు: 

వరంగల్‌లో రూ.500 కోట్లతో నిర్మించబోయే గూడ్స్ వ్యాగన్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన.

రూ.366 కోట్లతో నిర్మించబోయే వ్యాగన్ల ఓవర్‌తో హాలింగ్ వర్క్ అమిత్‌ షాప్‌కు శంకుస్థాపన.   

రూ.5,550 కోట్లు వ్యయంతో 176 కిమీ మేర జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన.