తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు

రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియమ్ ఖరారు చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్‌ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ ఆరాధేల నియమించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియమ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొలీజియమ్ సిఫార్సులను ఆమోదించడం లాంఛనప్రాయమే కనుక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయమూర్తులుగా వారిరువురూ రాబోతున్నట్లే భావించవచ్చు. 

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న ధీరజ్ సింగ్‌ ఠాకూర్ ఇప్పటి వరకు బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేయగా, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ ఆలోక్ ఆరదే కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా చేశారు. 

ఏపీ, హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా సేవలందించిన జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి కేరళ హైకోర్టుకు బదిలీ కాగా జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేస్తున్నారు. ఏపీ నుంచి కేరళకు వెళ్ళిన జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టిని, తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా సేవలందించిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది.