32.jpg)
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు మూడు రోజుల క్రితమే ఉద్యోగులకు 2.73% డీఏ పెంచిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఈరోజు సిఎం కేసీఆర్ ఉద్యోగులకు అనేక వరాలు ప్రకటించారు. తెలంగాణ దశాబ్ధి వేడుకల సందర్భంగా ఈ కానుకలు ఇస్తున్నట్లు ప్రకటించినా, డిసెంబర్‌లోగా జరుగబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వరాలు ప్రకటించిన్నట్లు భావించవచ్చు. ఏ కారణం చేత ఇస్తున్నప్పటికీ ఒకేసారి ఇన్ని వరాలు ఇస్తున్నందుకు ప్రభుత్వోద్యోగులు సంతోషంతో సంబురాలు చేసుకొంటున్నారు.
• ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30%కి పెంపు.
• బదిలీలపై వెళ్ళే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30%కి పెంపు.
• దివ్యాంగ ఉద్యోగులకు కన్వీనియన్స్ అలవెన్స్ రూ.2,000 నుంచి రూ.3,000కి పెంపు.
• షెడ్యూల్ ఏరియాలలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సేటరీ అలవెన్స్ 30%.
• స్టేట్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగులకు ఇన్సెంటివ్ 30%.
• సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లూ, క్రేన్ ఆపరేటర్లూ, డ్రైవర్లకు అదనంగా రూ.150 చెల్లింపు.
• ఇళ్ళు నిర్మించుకొనే ఉద్యోగులకు శాలరీ అడ్వాన్స్ పరిమితి రూ.20 నుంచి రూ.30 లక్షలకు పెంపు.
• కార్లు తదితర వాహనాల కొనుగోలుకి శాలరీ అడ్వాన్స్ పరిమితి రూ.6 నుంచి రూ.9 లక్షలకు పెంపు.
• ద్విచక్రవాహనాల కొనుగోలుకి శాలరీ అడ్వాన్స్ పరిమితి రూ.80 వేల నుంచి ఒక లక్షకు పెంపు.
• ఉద్యోగుల కుమార్తెల పెళ్ళికి శాలరీ అడ్వాన్స్ రూ.1 లక్ష నుంచి రూ.4 లక్షలకు పెంపు.
• ఉద్యోగుల కుమారుల పెళ్ళికి శాలరీ అడ్వాన్స్ రూ.75 వేల నుంచి రూ.3 లక్షలకు పెంపు.
• ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో అన్ని విభాగాలలోని ఉద్యోగులకు అదనంగా 15% స్పెషల్ పేమెంట్.
• పోలీస్ శాఖలో పలు విభాగాలలో ఇప్పటి వరకు ఇస్తున్న ‘స్పెషల్ పే’ను ఇకపై 2020 పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లింపబడుతుంది.
• పెన్షనర్లు మరణిస్తే ప్రభుత్వం అందిస్తున్న తక్షణసాయం రూ. 20 వేల నుంచి రూ.30 వేలకు పెంపు.