మహారాష్ట్రను కూడా సరిచేస్తాం... అవకాశం ఇవ్వండి!

సిఎం కేసీఆర్‌ ఈరోజు నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మరాఠీ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, ఓ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి 20-30 ఏళ్ళు పడుతుంది. కానీ 75 సంవత్సరాలైనా మన దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు?అంటే దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, బిజెపిలకు ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యం తప్ప దేశాభివృద్ధి కాకపోవడమే.  

మహారాష్ట్రలో నుంచే కృష్ణాగోదావరి నదులు ప్రవహిస్తాయి. కానీ మహారాష్ట్రలో రైతులు సాగుత్రాగుకి, ప్రజలు త్రాగునీరుకి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రాష్ట్రలో నదులు పారుతున్నా వినియోగించుకోలేక, పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా మహారాష్ట్రను పాలిస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఔరంగాబాద్, పూణే వంటి పెద్ద నగరాలలో కూడా వారానికో పది రోజులకో త్రాగునీరు సరఫరా అవుతుందని నేను విని ఆశ్చర్యపోయాను. 

 మేము తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొన్నాము. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మహారాష్ట్రని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మహారాష్ట్రను ఏవిదంగా అభివృద్ధి చేస్తామో మీరే చూద్దురుగాని,” అని కేసీఆర్‌ అన్నారు.