బిఆర్ఎస్ పార్టీ మొదట ఏపీ లేదా కర్ణాటకలో విస్తరిస్తుందని అందరూ భావించినప్పటికీ, అనూహ్యంగా మహారాష్ట్రలో విస్తరిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో రెండు మూడు సభలు, పార్టీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కొరకు సొంత భవనం కూడా నిర్మించుకొంది. సిఎం కేసీఆర్ గురువారం నాగ్‌పూర్ వెళ్ళి బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
ఇప్పుడు అత్యవసరంగా సొంత భవనం నిర్మించాల్సిన అవసరం లేదు. అద్దె భవనంలో కార్యాలయం నిర్వహించుకోవచ్చు. కానీ దాంతో పార్టీ నడిస్తే నడుస్తుంది లేకుంటే దుకాణం కట్టేసి వెళ్లిపోతుందనే భావన ప్రజలకు కలుగుతుంది. ఎన్ని కష్టానష్టాలు వచ్చినా మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ నిలిచి ఉంటుందని ప్రజలకు నమ్మకం కలిగించేందుకే నాగ్‌పూర్‌లో శాస్వితభవనంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ నేతలు చెప్పారు.
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు సుమారు వెయ్యి కిమీ సరిహద్దులు పంచుకొంటున్నాయి. కనుక సరిహద్దు గ్రామాల ప్రజలు తరచూ పొరుగు రాష్ట్రంలోకి రాకపోకలు సాగిస్తుంటారు. బంధుత్వాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాలు అత్యంత దయనీయ స్థితిలో ఉంటే పక్కనే తెలంగాణలో ఉన్న గ్రామాలకు 24 గంటలు ఉచిత విద్యుత్, త్రాగు, సాగునీరు, రైతు బంధు, మౌలిక సదుపాయాలు ఉండటం చూస్తున్న మరాఠీ ప్రజలు, తమ గ్రామాలు కూడా ఆవిదంగా అభివృద్ధి చెండాలని కోరుకొంవడం సహజం.
తెలంగాణ సరిహద్దు గ్రామాలలో జరిగిన అభివృద్ధిని కళ్ళారా చూస్తున్న ప్రజలు, బిఆర్ఎస్ పార్టీకి స్వాగతం పలుకుతున్నారు. అందుకే సోమవారం నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొంటున్నారు. త్వరలోనే ఔరంగాబాద్, పూణే, ముంబై నగరాలలో కూడా బిఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటుచేసుకోబోతోంది.