ఇప్పుడు అడగకుండానే తెలంగాణకు నిధులు!

కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలతో సహా దేశంలో పలు రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్నులలో 3వ విడత వాటాను సోమవారం విడుదల చేసింది. మొత్తం అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,18,280 కోట్లు విడుదల చేసింది. దానిలో ఏపీకి రూ.4,787 కోట్లు, తెలంగాణ రూ.2,486 కోట్లు విడుదల చేసింది. జూన్ పన్నుల వాటాతోపాటు వచ్చే నెలలో చెల్లించాల్సిన దానిలో కొంత అడ్వాన్స్ కూడా ఇప్పుడే చెల్లిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో 14 విడతలలో ఈవిదంగా రాష్ట్రాలకు పన్నులలో వాటాను చెల్లిస్తుంటుంది. వివిద రాష్ట్రాలకు విడుదల చేసిన పన్ను వాటా వివరాలు: