
తెలంగాణ బీజేపిలో ఏదో జరుగుతోంది. బీజేపి అధిష్టానం రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉందని కనుక ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించబోతోందని ఊహాగానాలు వినిపిస్తుంటే, అదేమీ కాదు... త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున, తెలంగాణ రాష్ట్రానికి బీజేపి చాలా ప్రాధాన్యం ఇస్తోందని తెలియజేసేందుకు అయనను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ ఆయనను బీజేపి అధ్యక్ష పదవి నుంచి తప్పించడం ఖాయం అని వాటి సారాంశం.
ఇక ఆయన స్థానంలో బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను నియమించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ కోసం కొత్తగా పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్ పదవి సృష్టించి ఆ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
మొత్తం మీద తెలంగాణ బీజేపిలో త్వరలోనే ఏవో కొన్ని పెద్ద మార్పులు జరగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నెల 15వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మంలో జరుగబోయే బీజేపి సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. కనుక అయన పర్యటన ముగిసిన తర్వాత తెలంగాణ బీజేపిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.