ఈ ఏడాది కనీవినీ ఎరుగని స్థాయిలో వేసవి ఎండలు, వడగాడ్పులు, ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. మాద్యమద్యలో కురిసిన భారీ వర్షాలు, వడగళ్ళ వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించినప్పటికీ వేసవి తాపం నుంచి మిగిలిన ప్రజలకు చాలా ఉపశమనం ఇచ్చాయి. కానీ జూన్ పదో తేదీ వస్తున్నా ఇంకా వేసవి ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారికి వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది.
ఈరోజు ఉదయం నుంచి నైరుతీ రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన్నట్లు తెలిపింది. దీంతో కేరళ, లక్షద్వీప ప్రాంతాలలో వర్షాలు ప్రారంభం అయ్యాయని తెలిపింది. మరో రెండు రోజులలో నైరుతీ రుతుపవనాలు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వ్యాపిచేందుకు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని తెలిపింది. కనుక మరొక వారం రోజులలోగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ప్రారంభం కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతమే ఉంటుందని తెలిపింది.