
సిఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు కొత్త సచివాలయంలో తొలిసారిగా మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలసేపుయ్ సాగిన ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. కొన్ని ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. ఆ వివరాలు:
• జీవో నంబర్:111ను పూర్తిగా ఎత్తేయాలని నిర్ణయించింది. ఈ జీవో పరిధిలో 84 ప్రజల అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. హెచ్ఎండీవో పరిధిలో ఉన్న ప్రాంతాలలో భూముల అభివృద్ధి, క్రయవిక్రయాలకు ఎటువంటి నియమనిబందనలు వర్తిస్తాయో, ఇకపై ఈ జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాలకు అవే వర్తిస్తాయి.
• కులవృత్తులను ప్రోత్సహించేందుకు మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఓ మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, లక్ష రూపాయలు చొప్పున ఆర్ధికసాయం అందించేందుకు అర్హతలు, విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఈ కొత్త పధకాన్ని దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
• కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను మూసీ, గండిపేట్, హిమాయత్ సాగర్లను అనుసంధానం చేసేందుకు, తర్వాత హుస్సేన్ సాగర్‌కు గోదావరి జలాలు పారించడానికి వీలుగా డిజైనింగ్, అంచనా వ్యయాలు సిద్దం చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
• తెలంగాణలో 33 జిల్లాలకు డీఎం అండ్ హెచ్‌వో పోస్టులు మంజూరు. హైదరాబాద్ నగరానికి ఆరు పోస్టులు మంజూరు. రాష్ట్రం మొత్తం మీద 38 మంది డీఎం అండ్ హెచ్‌వోలు ఉండబోతున్నారు.
• కొత్తగా ఏర్పడిన 40 మండలాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటుకి ఆమోదం.
• అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఇకపై శాస్విత ప్రాతిపదికన సిబ్బందిని నియమించేందుకు ఆమోదం తెలిపారు.
• వీఆర్ఏల క్రమబద్దీకరణకు ఆమోదం.
• టిఎస్పీఎస్సీలో కొత్తగా మరో 10 పోస్టుల భర్తీకి ఆమోదం.
• రెండో విడత గొర్రెల పంపిణీకి ఆమోదం.