కర్ణాటకలో ఎంత ప్రచారం చేసినా పోలింగ్ శాతం ఇంతేనా?

ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం 52.03% పోలింగ్ నమోదైంది. ఇదివరకు ఎన్నడూలేని విదంగా గత మూడు నెలలుగా కాంగ్రెస్‌, బిజెపిల అగ్రనేతలు పదేపదే రాష్ట్రంలో పర్యటిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. ఆది, సోమ, శుక్ర, శనివారాలలో పోలింగ్ నిర్వహిస్తే ఐ‌టి ఉద్యోగులందరూ డుమ్మా కొడుతున్నారని గుర్తించిన ఇక ఎన్నికల సంఘం ఈసారి వారం మద్యలో నేడు బుదవారం పోలింగ్ నిర్వహిస్తోంది. కనుక ఈసారి 90-92% పోలింగ్ నమోదు కావచ్చనుకొంటే కేవలం 52.03 శాతమే నమోదైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియబోతోంది. కనుక ఈ మూడు గంటల్లో మరో 20-30% పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. 

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని పలు సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. అయితే ఈసారి కూడా బిజెపియే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగానే వెలువడే ‘ఎగ్జిట్ పోల్స్’తో మరింత స్పష్టత రావచ్చు.