ఇంటలిజన్స్ బృందాలు, మద్య ప్రదేశ్ పోలీసులు కలిసి ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఆకస్మికంగా దాడులు చేసి 16 మందిని అరెస్ట్ చేశారు. వారందరూ గత ఏడాదిన్నరగా హైదరాబాద్‌లో రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు చేసి అందరినీ అరెస్ట్ చేశారు. వారిలో 11 మంది భోపాల్‌కు చెందినవారు కాగా మిగిలిన ఐదుగురూ హైదరాబాద్‌కు చెందినవారే. వారి వద్ద నుంచి పోలీసులు జిహాది సాహిత్యం, కత్తులు, నాటు తుపాకులు స్వాధీనం చేసుకొన్నారు. కొంతకాలం క్రితం భోపాల్ నగరంలో పోలీసులు ఓ కేసులో కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ జరపగా, హైదరాబాద్‌లో నక్కిన ఉగ్రవాదుల గురించి తెలిసింది. అప్పటి నుంచి నిఘా బృందాలు వారిపై నిఘా పెట్టి నిజమేనని ధృవీకరించుకొన్న తర్వాత వారిని ఈరోజు అరెస్ట్ చేసి భోపాల్ తరలించారు.