నేడే ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం

ఓ ప్రాంతీయ పార్టీకి దేశరాజధానిలో శాశ్విత కార్యాలయం ఉండటం విశేషమే. బిఆర్ఎస్ పార్టీ ఇటువంటి అరుదైన ఘనత దక్కించుకోబోతోంది. ఢిల్లీ నడిబొడ్డున వసంత్ విహార్ వద్ద గత ఏడాది సెప్టెంబర్‌ 2న భూమిపూజ చేసి నిర్మాణపనులు మొదలు పెట్టి శరవేగంగా పూర్తి చేశారు. 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్‌+3 అంతస్తులతో దీనిని నిర్మించారు. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ పార్టీ కార్యాలయం ఆవరణలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, వెంకటేష్ తదితరులు సుదర్శనయాగం, వాస్తుపూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు సిఎం కేసీఆర్‌తో పాటు ప్రత్యేకవిమానంలో ఢిల్లీ చేరుకొన్నారు. ధ్యాహ్నం 1.05 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్ణాహుతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వచనాలు పొందిన తర్వాత బిఆర్ఎస్ భవనానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేస్తారు.